Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఆయన ఒక ఆసాధారణ వ్యక్తి అని.. ఆచరణలో చూపించిన ధైర్యం జాతిని ఏకం చేసిన పరాక్రముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని 31వ డివిజన్ సీపీఐ(ఎం) కార్పొరేటర్ యర్రా గోపి అన్నారు. ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా త్రీ టౌన్ లోని సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యర్రా గోపి మాట్లాడుతూ భారత సరిహద్దులను దాటి తన ఎత్తుగడలతో బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన యోధుడని జైహింద్ నినాదాలతో భారత జాతిని ఏకం చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సిపిఎం శాఖా కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, పెద్దోజు ఉపేంద్ర చారి, కె. అన్వేష్, యర్రా మల్లికార్జున్, వెంకన్న, రాము, తాళ్లూరి రాధ, తదితరులు పాల్గొన్నారు.