Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న రాపత్తు సేవలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన రాపత్తు సేవలు 23తో ముగియనున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం వన విహారి మండపంలో నిర్వహించాల్సిన రాపత్తు ఉత్సవాన్ని కరోనా నిబంధనల మేరకు చిత్రకూట మండపంలో రాపత్తు సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని అందంగా అలంకరించి చిత్రకూట మండపంకు తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం నుంచి విలాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించను న్నారు. కాగా 29న స్వామి వారికి విశ్వరూప సేవ సర్వదేవతా అలంకారం నిర్వహించ నున్నారు.