Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రామారావుపేట సర్పంచ్ పార్వతి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని రామారావు పేట గ్రామంలోని ఒడ్డు గుంపు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తూ గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దడంలో ప్రధానోపాద్యాయుడి సేవలు అభినందనీయమని రామారావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ సోయం పార్వతి అన్నారు. బదీలీ పౖ ఖమ్మం వెళుతున్న ప్రధానోపాద్యాయుడు కె.వి రమణను ఆదివారం సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు, విద్యార్ధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రధానోపాద్యాయుడిగా గిరిజన విద్యార్ధులకు అత్యుత్తమ విద్యా బోధనతో పాటు ఇక్కడ చదువుకున్న విద్యార్ధులను సైనిక్, ఏకలవ్య, గురుకులాల్లో సీట్లు వచ్చే విదంగా తన వంతుగా కృషి చేశాడన్నారు. విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య మాట్లాడుతూ విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన కె.వి రమణ లాంటి ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడం విద్యార్ధులకు తీరని లోటు అన్నారు. 24 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఎంతో మంది గిరిజన విద్యార్దును తీర్చి దిద్దిన కెవి.రమణ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కారం రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు సంగా శ్రీను, రవి, గౌరి, దగ్గుపల్లి శ్రీను, ధనికొండ శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.