Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా భద్రాచలానికి చెందిన గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల అభివృద్ధి, అభ్యున్నతికి కృషి చేసిన పాకాల దుర్గాప్రసాద్ సేవలను గుర్తించి ఆలిండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు ఇస్తూ ఎంపిక చేశామన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదివారం గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పాకాల దుర్గాప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కొచ్చెర్లకోట నరసింహారావు, కోశాధికారి కొవ్వూరు సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వి.కృష్ణ మోహన్, పురుషోత్తం, ఆర్.కె.విశ్వనాథ్, జయంత్ కుమార్ శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.