Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ జిల్లా కార్యదర్శి కె.వి.రమణ
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడుకు చెందిన స్వేరో రాష్ట్ర నాయకులు గొర్ల వీరబాబు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరి ప్రజాసేవ చేయాలని బీఎస్పీ జిల్లా కార్యదర్శి కెవి రమణ అన్నారు. ఆదివారం బూర్గంపాడులోని గోర్ల వీరబాబువారి నివాసం వద్ద మర్యాధ పూర్వకంగా బూర్గంపాడుకు చెందిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసివారికి పుష్పగుచ్చాన్ని అందించి, వారిని బీఎస్పీ పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా కార్యదర్శి కెవి.రమణ మాట్లాడుతూ వారి సేవలు నేటి సమాజానికి చాల అవసరం ఉందన్నారు. గొర్ల వీరబాబు రాజకీయాలలో లేకుండానే గోదావరి వరదలొచ్చినపుడు వరదబాధితులకు అన్నదానం, మంచినీటి వసతి, పండ్లు ఫలాలాలు అందించి ఆదరించారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నిత్యం పేదప్రజలకు, ఎందరో పేద విద్యార్ధులకు వారి సమస్యల్లో అండగ నిలుస్తున్నారని ఆయన అన్నారు. వీరబాబు రాజకీయలలో లేకుండానే నిస్వార్ధంగ విస్తృతంగ నేటి సమాజంలో సేవలందిస్తున్నారని, సమాజసేవకుడు బహుజన సమాజ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చి వీరి సేవలను సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు కుర్సం రమేష్, ప్రధాన కార్యదర్శి కేసుపాక రామకృష్ణ, మండల అధ్యక్షులు ఇసంపల్లి నరహరి, నాయకులు బొల్లి సంపత్, కేసుపాక మల్లేష్, తోకల చిన్ని, కేసుపాక సీతారాంబాబు, శంకర్, రమణయ్య, కొమ్ము లక్మీ, తులస మ్మ, సావిత్రి, బుజ్జి, నర్సింహ, పున్నమ్మ, ముత్యం తదితరులు పాల్గొన్నారు.