Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
ఇటీవల కాలంలో విధి నిర్వహణలో విద్యుద్ఘాతంతో గాయాలపాలైన మండలంలోని తొమ్మిదో మైలు తండా గ్రామపంచాయతీ కార్మికుడు ఈసం బాబు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని ఐఎఫ్టీయూ ప్రతినిధి బృందం డిమాండ్ చేశారు. ఆదివారం స్వగ్రామంమైన సాయన్న పేటలోని కార్మికుని ఇంటికి వెళ్లిపరామర్శించినట్లు తెలిపారు. ప్రతినిధి బృంద సభ్యులు మాట్లాడారు. ప్రభుత్వమే ఈసం బాబు వైద్య ఖర్చులు భరించాలని, తన విశ్రాంతి కాలానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేస్తున్న మల్టీపర్పస్ విధానం వల్లనే ఈసం బాబు గాయాలపాలవ్వడానికి కారణమన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో ఇఫ్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు కొక్కు సారంగపాణి, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జటంగి వెంకన్న (జెకె), జిల్లా ఉపాధ్యక్షులు సామేలు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు లక్షమయ్య, రామస్వామి, ఎఐకెఎంఎస్ మండల కార్యదర్శి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.