Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా విద్యాధికారి ఇ.సోమశేఖర శర్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
నేటి నుంచి జిల్లాలో ఆన్లైన్ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్్ బోధన ప్రారంభం కానున్నట్లు జిల్లా విద్యాధికారి ఇ.సోమశేఖర శర్మ తెలిపారు. రాష్ట్రంలో 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ బోధనను చేపట్టేందుకు అనుమతినిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని, జిల్లాలోని ఉన్నత పాఠశాల మండల విద్యాధికారులతో, ప్రధానోపాధ్యాయులతో ఆదివారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, విద్యాశాఖ ఆన్లైన్ తరగతులను నిర్వహించేందుకు అన్ని యాజమాన్యాలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. సర్కారు బడుల్లో కూడా ఆన్లైన్ తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావాలన్నారు. సగం మంది సిబ్బంది ఒకరోజు, మిగిలిన సగం మంది మరో రోజు పాఠశాలకు తప్పక హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కు రానియకూడదని తెలిపారు. 15 సంవత్సరాల వయసు పై బడిని విద్యార్థులందరూ వాక్సిన్ తీసుకునేలా చూడాలి. అందరికీ డిజిటల్ డివైస్ అందుబాటులో ఉండేలా చూడాలి.. లేని విద్యార్థులను మ్యాపింగ్ చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులందరూ సకాలంలో ఎగ్జామ్ ఫీజు చెల్లించేల చూడాలని, మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ లేని స్కూల్స్, టాయిలెట్స్ లేని స్కూల్స్ వివరాలు ఎంఈఓల ద్వారా మాకు తెలియపరచాలని తెలిపారు.
రవాణా సౌకర్యం అర్హత కల్గిన విద్యార్థుల వివరాలు 2 రోజుల్లో ఎఈఓలకు అందించాన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పోటీలలో అన్ని స్కూల్స్ విద్యార్ధులు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి ఎస్.మాధవరావు, ఏసీజిఇ రామేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ కో-ఆర్డినేటర్లు ఏ.నాగరాజు శేఖర్, ఎస్కె.సైదులు, జె.అన్నామణి, ఎన్.సతీష్ కుమార్, ఏపీఓ.కె.కిరణ్ కుమార్, మండల విద్యాధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.