Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని నరసాపురం తండాకు చెందిన భుక్యా బాలాజీ మిర్చి పంట సాగుచేసి పంట నష్టపోయి అప్పులపాలు కావడంతో పాటు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుమందు తాగి చనిపోయిన విషయం తెలిసిందే! కాగా మృతుడి భార్యా, ఇద్దరు పిల్లలు కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఖమ్మంలో ఆర్ఎస్ఐ పనిచేస్తున్న మండల కేంద్రానికి చెందిన గడ్డం సతీష్ ఆదివారం రూ.36000.ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకొని చనిపోవడం బాధాకరం అన్నారు. బతికి ఉండి సమస్యలతో పోరాటం చేయాలి కానీ మరణించడం సమస్యలకు పరిష్కారం కాదన్నారు. దీంతో ఆర్ఎస్ఐ గడ్డం సతీష్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీటీసీ ఎస్కే సంధాని, రోళ్ళగడ్డ సర్పంచ్ అజ్మీరా మోహన్, గుండాల ఎస్ఐ దారం సురేష్, ఆర్ఎస్ఐ గడ్డం సాగర్ పాల్గొన్నారు.