Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులకు ఎంపీకి వినతులు
- సానుకులంగా స్పందించిన ఎంపీ,
ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం కారేపల్లి మండలంలో వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములునాయక్‌తో కలిసి పర్యటించారు. గేటుకారేపల్లిలో ఇటివల మృతి చెందిన వెంకటసాయి పిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ మేనేజర్ మండెపూడి వెంకటప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ టీఆర్ఎస్ అధ్యక్షులు తోటకూరి పిచ్చయ్య స్వగృహంలో ప్రజలు ఇచ్చిన విన్నతులను ఎంపీ నామా స్వీకరించారు. గేటుకారేపల్లి ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రాంతంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, తోటకూరి పిచ్చయ్య, సొసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, డైరక్టర్ అడ్డగోడ ఐలయ్యలు అభ్యర్ధించగా దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయమై విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడని గేటుకారేపల్లి సబ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాధనలు పంపిస్తామని చెప్పారని, రెండో ప్రపోజల్గా మాధారం డోలమైట్ మైన్స్ నుండి గేటుకారేపల్లి, కమలాపురం ప్రాంతాలకు ప్లీడర్ను కలపటానికి అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. గేటుకారేపల్లి సర్పంచ్ బానోత్ సక్రాం రహదారుల సమస్యను, రైల్వే బ్రిడ్జీ నిర్మాణం విషయాన్ని ఎంపీ దృష్టికి తేగా ఎంపీపీ మాలోత్ శకుంతల ద్వారా ప్రతిపాధనలు పంపితే అధికారులతో మాట్లాడతానని తెలిపారు. ఏజన్సీ గ్రామాలకు వచ్చి తమ సమస్యలను తెలుసుకోవాలని సర్పంచ్ కోరగా మీరు, ఎమ్మెల్యే ఆహ్వానిస్తే తప్పని సరిగా వస్తానని సమాధానం చెప్పారు.
నిరసన ప్రయత్నంను అడ్డుకున్న పోలీసులు
గిద్దవారిగూడెంకు పర్యటించిన ఎంపీ ఆ గ్రామంలో ఇటీవల మృతి చెందిన డేగల వెంకటయ్య, డేగల వెంకన్న కుటుంబాలను పరామర్శించి సోసైటీ డైరక్టర్ డేగల ఉపేందర్ ఇంటిలో తేనీటి విందును స్వీకరించారు. గ్రామస్తులు తమ గ్రామం నుండి ఇల్లందు-ఖమ్మం ఆర్ Ê బీ రోడ్డ్ వరకు గల కిలోమీటరు రహదారి కంకరు తేలి నడవ లేని పరిస్ధితి ఉందని, తమ పరిస్ధితి ఎవరు పట్టించుకోవటం లేదంటూ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయగా సీఐ అరీఫ్ అలీఖాన్ వారి సముదాయించి రోడ్డు పక్కకు తీసుకవెళ్ళి ఎంపీ, ఎమ్మెల్యేను సాగనంపారు. కిలో మీటరు దారి బీటీ నిలవటానవికి కారణం తెలుసుకోని దానిని పూర్తి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఎంపీ పర్యటనలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు స్వర్ణకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ దారావత్ మంగీలాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, రైతు బంధు మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.