Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జడ్పీ చైర్మన్ కమల్ రాజు
నవతెలంగాణ - బోనకల్
రైతు కుటుంబాలకు రైతు బీమా రైతు బంధు ఒక వరం లాంటిదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు అన్నారు. బోనకల్ మండలం ఆళ్ళపాడు గ్రామం లో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తొలుత మరీదు కృష్ణయ్య సతీమణి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.బుంగ బాలరాజు, అమరబోయిన నరసయ్య, మొండితోక లలిత, మరీదు శ్రీను ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చిన్న కేసి పెద్ద వెంకయ్య సతీమణి అస్వస్థతతో ఉండడంతో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన రైతు కుటుంబాల అందరికీ రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు అందజేసినట్లు ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఇటు వంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ము జంగా రవికుమార్, టిఆర్ఎస్ నాయకులు బంధం నాగేశ్వరరావు, చావా హనుమంతరావు, వెనిగండ్ల మురళి, మంద రామకృష్ణ, వివిధ గ్రామాల టిఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.