Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
అ కలెక్టరేట్ ముందు బాధితురాలి కుటుంబ సభ్యుల నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
పాల్వంచ ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ వల్ల చనిపోయిన ముత్యాల సునీత కుటుంబానికి న్యాయం చేసి, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. పాల్వంచ నవభారత్‌లోని ఎస్సీ గురుకుల బాలికల గురుకుల పాఠశాల, కళాశాల (గర్ల్స్) ప్రిన్సిపాల్ శాంత కుమారి పేద కుటుంబలకు చెందిన విద్యార్థుల, ఉద్యోగులు, వర్కర్లుపై దోపీడీ చేస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. విచారణ చేసి చర్యలు తిసుకొని బాధ్యులకు న్యాయం చేసి పేద కుటుంబాలను కాపాడాలని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. మరొకరికి పోస్టింగ్ ఇవ్వడం కోసం అదే పాఠశాలలో కొన్ని నెలలుగా పనిచేసిన, విలెజ్ లెర్నింగ్ సెంటర్, ఆన్ లైన్ క్లాస్ కూడా సమర్థవంతంగా నిర్వహించిన తెలుగు తాత్కాలిక ఉపాధ్యాయురాలు సునీతాను బెదిరించి, క్రూరంగా హింసించి తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. సునీత మానసిక క్షోభకు గురై పక్షవాతానికి గురై, ఈ నెల 18వ తేదీన మరణించిడం జరిగిందని తెలిపారు. ఆమె మరణంతో కుటుంబం ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ పోషన భారంగా మారిందని తెలిపారు. ఇంతటి దుర్మార్గాంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సహయం అందించాలని కోరారు. అదే పాఠశాలలో 10 సంవత్సరాలుగా హింధీ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం చేస్తు అజాజ్బీని విద్యార్థులుకు సపోర్ట్‌గా ఉందనే నెపంతో ఉద్యోగం తిసి వేసి ఆమె కుటుంబాన్ని రోడ్డునా పడేసిందని ఆరోపించారు. కళాశాల ప్రిన్సిపాల్ శాంతి కూమరి, వైస్ ప్రిన్సిపల్ దుర్గాపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు నాయ్యం చేయాలని కలెక్టర్ వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరణించిన ముత్యాల సునీత కుటుంబ సభ్యులు, అజాద్బీ, వీరమ్మ, నారాయణ, కుసం సంధ్యా, నునవత్ రమేష్, ప్రవీణ్ కుమార్, బాబు, పాల్గొన్నారు.