Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా
దినోత్సవం నిర్వహణ
అ పోస్టల్ ఐపీవో సుచెందర్
నవతెలంగాణ-పినపాక
ఆడపిల్లలకు తగినంత స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వివక్షలను నిర్మూలించడానికి, ఆడపిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాయని పోస్టల్ ఐపీవో సుచెందర్ అన్నారు. పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో జరిగిన సుకన్య సమద్ధి యోజన పథకం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. బాలికల చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీ ఆడపిల్లలకు మీరు ఆర్థికంగా రక్షణ కల్పించాలి అనుకుంటే పోస్టల్ శాఖ అందిస్తున్న సుకన్య సమద్ధి సమృద్ధి యోజన పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ సిబ్బంది యంవో సుధీర్, పోస్ట్మాస్టర్లు దీక్షితులు, సర్వేశ్వరరావు, శ్రీనివాస రావు, విజరు కుమార్, బల రామారావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.