Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో సీఐ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఫ్రెండ్లీ పోలీస్‌గా ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలు అందించడమే తెలంగాణ పోలీస్ ముందు ఉన్న ఎకైక లక్ష్యం అని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం లకీëనగరం గిరిజన బాలికల వసతి గృహంలో జిల్లా ఎస్పీ సునీల్‌దత్, ఏఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారికి కళ్ల అద్దాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది మెగా ఉచిత కంటీ వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్న 600 వందల మందికి ఉచితంగా కళ్ల అద్దాలను దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందించినట్టు తెలిపారు. అందులో భాగంగా కరోనా నిబందనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్ నిర్వహించిన అనంతరం మొదటి రోజు 200 వందల మందికి కళ్ల అద్దాలు అందజేయడం జరిగిందన్నారు. ఇంకో రెండు రోజుల పాటు ప్రతి కళ్లజోళ్లను వీటిని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అవసరమున్న వారికి త్వరలో కంటి ఆపరేషన్లు సైతం చేపించనున్నట్టు తెలిపారు. మండలంలో క్రీడలను ప్రోత్స హించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీస్ దృష్టికి తీసుకు వస్తే సంబందిత శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విదంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి సభ్యు రాలు తెల్లం సీతమ్మ, ఎస్ఐ రవికుమార్, వైద్యులు మణిదీప్, చైతన్య, సర్పంచ్‌లు తెల్లం కృష్ణవేణి, పూజారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.