Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కడాలి నాగరాజుకి భారత సేవ రత్న పురస్కారం
అ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అందజేత
నవతెలంగాణ-భద్రాచలం
జేడీ ఫౌండేషన్ కీలక సభ్యుడు, భద్రాచలం పట్టణంలో సుపరిచితుడు, సమాజ సేవకుడు కడాలి నాగరాజుకి 2022 సంవత్సరానికి గాను హైదరా బాద్కి చెందిన సిజియస్ వల్లూరి ఫౌండేషన్ వారు సామాజిక సేవకి గుర్తింపుగా భారత సేవ రత్న అవార్డు ను అందజేశారు. ఈ మేరకు హైదరాబాదులో సుందరయ్య కళా కేంద్రంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదగా ప్రముఖుల సమక్షంలో నాగరాజుకి ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జెడి ఫౌండేషన్ తోపాటు భద్రాచలంలో వివిధ స్వచ్ఛంద సంస్థల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కడాలి నాగరాజు సేవలకు పురస్కారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడం పట్ల కడాలి నాగరాజుకు జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్, పౌండేషన్ సభ్యులు ఇతర మిత్రులు అభినందనలు తెలిపారు.