Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధికి కృషి చేయాలి
అ టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ
నవతెలంగాణ-ఇల్లందు
నిత్యం పేదల పక్షాన ఆదివాసీలు ఎదురుకుంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించడమే కాకుండా ప్రజా వాణీని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వినిపించిన మహానీయుడు సున్నం రాజయ్య అని టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు. మండలంలోని సీఏస్పీ బస్తి గ్రామ పంచాయతీ రాజీవనగర్ శివారులో టీఏజిఎస్ పోరాటంతో ఆదివాసీలు ఇండ్ల స్థలాల సాధించుకొని ఇండ్లు నిర్మించుకున్నారు. ఆదివాసీలకు అండగా నిలుస్తుందని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నగర్‌గా ఆ కాలనీకి నామకరణం చేసి వారి ఫోటోకు పూల మాల వేశారు. ఈ సందర్భంగా జెండాను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభను ఉద్దేశించి ఆయన, జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్‌లు మాట్లాడుతూ రాజయ్య పోడు సమస్యపైన, జీఓ నెంబర్ 3 కోసం పాలకులను నిలదీయడమే కాకుండా ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారాని అలాంటి ఆదివాసీ యోధుడిని ఆదర్శంగా తీసుకోని భవిష్యత్ పోరాటాలను నిర్వహించాలని అన్నారు. అర్హులైన ఆదివాసీలకు డబల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని అన్నారు. సున్నం రాజయ్య నగర్‌ను అభివృద్ధి చేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాసా నాయకులు ఆలేటి కిరణ్, కెవిపిఎస్ నాయకులు మన్నెం మోహన్ రావు, జయసుధ, వసంత, హైమ, లక్ష్మణ్, కృష్ణ, నాగమ్మ, అనిత, కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.