Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి యువత ముందుకు రావాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచల మండల పట్టణ బూత్ లెవెల్ సభ్యత్వ నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే యువత ముందుకు రావాలని, యువత తోటే భారతదేశ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నమోదు చేయుటకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి కుమార్, మండల అధ్యక్షులు నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, సీనియర్ నాయకులు బలుసు సతీష్ కుమార్, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధీర్ కుమార్, ప్రదీప్, సరేళ్ళ వెంకటేష్, సాయిబాబు, దేవకి, రాణి, వసీమ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.