Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలపక్ష నాయకులు
నవతెలంగాణ-మణుగూరు
మణికంఠనగర్ భూ నిర్వాసితుల భూములు జోలికి వెళ్తే సహించేది లేదని అఖిలపక్ష నాయకులు ఆరోపిం చారు. సోమవారం మణికంఠనగర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులను కలుసుకోని వారికి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో బొల్లోజు అయో ధ్యచారి, తుళ్ళూరి బ్రహ్మయ్య, చందా సంతోష్, ఉప్పతల నర్సింహారావు, ఆర్ మధుసూదన్‌రెడ్డి, వాసిరెడ్డి చలపతి రావు, బిక్షపతి తదితర నాయకులు మాట్లాడారు. మణుగూరు ఓసి భూ నిర్వాసితులైన పద్మగూడెం, మల్లెపల్లి, యగ్గడిగూడెం గ్రామస్తులు సర్వం కోల్పోయి తమకు ఇచ్చన డబ్బులతో మణికంఠనగర్‌లో వాడే అనిత వద్ద నుండి సర్వే నెంబర్ 138/34/1 గల భూములలో 2018-19 సంవత్స రంలో కోనుగోలు చేశారన్నారు. ఆ భూమి నాది అంటూ పెనుబల్లి రాము భూ నిర్వాసితులను బెదిరిస్తున్నర న్నారు. వాదన ఎందుకని రూ.కోటి తీసుకురండి సర్దుబాటు చేస్తామ న్నారు. చివరకు రూ.నాలుగు లక్షలకు సెటిల్మెంట్ చేద్దామంటూ, లేకుంటే మీ ఇష్టమని బెదిరిస్తున్నారన్నారు. ఆధారాలు అన్ని ఉన్నా అధికారులు మాత్రం వారి వైపే మాట్లాడుతు న్నారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరన్నారు. గతంలో వేసుకున్న నివాస స్థలాలలను బలవంతంగా కూలగొట్టారన్నారు. భూములు కోల్పోయి ఉన్న డబ్బులతో నివసించ డానికి ఇండ్ల స్థలం కోనుగోలు చేసి ఇల్లు కట్టుకోని నివసించే అధికారం పేద, మధ్యతరగతి ప్రజలకు లేదా అని, గత రెండు సంవత్సరాల నుండి మణుగూరులో భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను దోచు కుంటున్నారన్నారు.
ఈ భూమిపై సర్వ హాక్కులు, ఆధారాలు భూ నిర్వాసితులకే ఉన్నాయని వారికి అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్ ఎంప ీపీ కెవిరావు, ఉపసర్పంచ్ పుచ్చ కాయ ల శంకర్, దుర్గ్యాల సుదాకర్, రమేష్, నవీన్, నర్సింహారావు, రషీద్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.