Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండల కేంద్రమైన టేకులపల్లిలోని సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మన్ భానోత్ హరీ సింగ్‌లు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నాలుగు లక్షల 50 వేల వ్యయంతో కూడిన మండల పరిషత్ నిధుల ద్వారా ముత్యాలమ్మ బజార్లో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో దాసు తండ ఎంపీటీసీ బాలకృష్ణ, టేకులపల్లి ఎంపీటీసీ అప్పారావు, బర్మావత్ శివ కృష్ణ, రామ నాయక్, రవి నాయక్, కృష్ణా నాయక్ గ్రామ సర్పంచి బోడా సరిత, వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.