Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నివారణకు పోలీసులు
చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రంగా కొనసాగుతున్న లకీëనగరం ప్రదాన సెంటర్లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లకీëనగరం కేంద్రంగా ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌తో పాటు వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలోని 104 గ్రామాలకు చెందిన ప్రజలు, పక్కనే ఉన్న చత్తీష్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన పలు గిరిజన గ్రామాలు, చర్ల మండలంలోని పులిగుండాల గ్రామ పంచాయతీలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఏదో ఒక పని మీద లకీëనగరం వస్తుంటారు. దీంతో ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు లకీëగనరం ఆయా గ్రామాల ప్రజలతో రద్దీగా తయారైంది..
ప్రమాదాలు ఇలా : లకీëగనరం గ్రామంలో గల వివిధ దుకాణ సముదాయాలు మొత్తం భద్రాచలం, చర్ల ప్రదాన రహదారికి రెండు వైపులా ఉన్నాయి. ఇదే రహదారి గుండా నిత్యం పర్ణశాల రామాలయానికి వచ్చే వాహనాలు, చర్ల, వెంకటాపురం వరంగల్‌తో పాటు చత్తీష్ఘడ్కు వెళ్లే వాహనాలు సైతం ఇదే రహదారి గుండా నిత్యం ఏదో ఒక పని మీద రాక పోకలు సాగిస్తుంటారు. ఆటో వాలాలు సైతం ఒక అడ్డా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో గల మేకలు సైతం రహదారి పైనే సంచరించడం వలన ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. కాలి నడకన రోడ్డు దాటే సమ యంలో, ద్విచక్రవాహనాలు అతి వేగంగా వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా సోమవారం ఒక్క రోజే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఓ ద్విచక్రవాహన దారుడు ఎదురుగా చిన్న బాబుతో వెళుతున్న ద్విచక్రవాహ నాన్ని ఢ కొన్న సంఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పాటు నడుచుకుంటు వెళుతున్న ఓ వ్యక్తిని ద్విచక్రవాహనం ఢ కొట్టిన సంఘటనలో ఆ వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఇలా ఇటీవల లకీëనగరం సెంటర్లో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయనే చెప్పవచ్చు.
ప్రమాదలను అరికట్టాలి : మండల కేంద్రంగా ఉన్న లకీëనగరం సెంటర్లో జరుగుతున్న రోడ్డు ప్రమా దాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వివిధ పనులపై లకీëనగరం గ్రామానికి వస్తున్న ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు వాహనాల వేగాలను అరికట్టేందుకు పలు చోట్ల బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ను నియంత్రింంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులపైనే ఉందనే చెప్పవచ్చు.