Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కమిటీ చైర్మెన్, గాయత్రి గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అధినేత, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి) జన్మదిన వేడుకలు మండలంలోని కరివారిగూడెం గ్రామంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం, కరివారిగూడెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో రవిచంద్ర పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో కేక్ కట్ చేసి గ్రామస్తులు అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి తాటికొండ కృష్ణరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రోకటి సురేష్, ట్రెజరర్ బాపట్ల మురళి, మండల సంక్షేమ సంఘ నాయకులు రాంబాబు, నరసింహారావు, రామారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.