Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
వైద్యాధికారుల అనుమతులు లేకుండా కరోనా పరీక్షలు చేయడం సరికాదని, రక్త పరీక్షా కేంద్రాల వారు అనుమతులు....ఆర్హత లేకుంటే పరీక్షలు నిర్వహిస్తే ల్యాబ్ సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ జేవిఎల్.శిరీష హెచ్చరించారు. సోమవారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణంలోని పలు రక్త పరీక్షా కేంద్రాలు, ల్యాబ్‌లను ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ముందుగా కొత్తగూడెంలోని బాలాజీ డయాగస్టిక్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆధారాలు లభ్యమైనందున యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. పాల్వంచ పట్టణంలోని అను మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌లో తనిఖీ చేశారు. అను ల్యాబ్‌లో రెండు కరోనా కిట్లు లభ్యమైనందున, చిల్డ్రన్ స్పెషలిస్టు లేకుండా పిల్లకు చికిత్సను అందిస్తున్న తీరుపై యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్ నిర్వహించే వారికి సరియైన క్యాలిఫికేషన్ లేకుంటే ల్యాబ్ పరిమిషను రద్దు చేస్తామని హెచ్చరించారు. పరిమిషన్ లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తే సీజ్ చేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిమిషన్ లేకుండా ల్యాబ్ నిర్వహించిన, కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటా మన్నారు. ఈ కార్యక్రమములో టీమ్ సభ్యులు టి.మోహన్, డిపిఎంఓ టి.విజయకుమార్, హెల్త్ ఎడ్యూకేటర్ డి.నిఖేష్, దశరద్ తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్సర్వేలు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతుంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా1074 టీములు ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వేచేశారు. మొత్తంగా 17546 కుటుంబాలలో సర్వే చేశారు. 1216 మందికి జ్వర లక్షణాలు కనిపించాయి. వారికి ఆరోగ్య సిబ్బంది1216 మెడిసిన్ కిట్స్ అందజేశారు.
కోవిడ్ పరీక్షలు : జిల్లా వ్యాప్తంగా సోమవారం కరోనా పరీక్షలు ముమ్మంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 432 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. 5160 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. భద్రాచలం డివిజన్లో 34, కొత్తగూడెం సింగరేణి ప్రధాన అసుపత్రిలో147 కేసులు, కొత్తగూడెం డివిజన్లో251 పాజిటివ్ కేసులు, మొత్తంగా 432 పాజిటీవ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారి కార్యాలయం అధికారులు వెల్లడించారు.