Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆకస్మికంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
పోషనలోపం లేని భావిభారతావని నిర్మాణానికి అంగన్వాడీ కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం పట్టణంలోని గుడిపాడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన న్యూట్రి కిచన్గార్డెన్ను పరిశీలించి న్యూట్రీ గార్డెన్లో టీచర్ ఆయాలు కూరగాయలు పండిస్తున్నారని కిచెన్ గార్డెన్ చాలా బాగా చేశారని అభినందించారు. కిచెన్‌గార్డెన్‌లో పండిన తాజా కూరగాయల వల్ల చిన్నారులు పోషణ లోపాన్ని అధిగమిస్తారని అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యంతోపాటు ప్రహరీ గోడను నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో రంగురంగుల బొమ్మలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన చిన్నారులను అభినందించారు. ఈనెల 22వ ప్రధానమంత్రి అకాంక్షత జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్‌లో అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలకిë, సీడీపీఓ కనకదుర్గ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అసీమా భేగం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.