Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి మొండ్రాయి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పర్వతగిరి గ్రామానికి చెందిన పుల్లూరి సారయ్య పెద్ద కుమార్తె స్రవంతి(32)కి ఎనిమి దేండ్ల కిందట మొండ్రాయికి చెందిన దుడ్డె ప్రశాంత్‌తో వివాహ మైంది. వారికి ఇద్దరు పిల్లలు కుషాల్, చిన్మయి ఉన్నారు. స్రవంతి దుగ్గొండి ఎంపీడీఓ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఆరు నెలల కిందట ఆమె మరిది ప్రణరు అతని భార్యతో గొడవ పడడంతో కుటుంబంలో కలహాలు తలెత్తాయి. అనంతరం ఆమె అత్తగారి ఇల్లును కొనుగోలు చేసి భర్త ప్రశాంత్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించింది. అప్పటినుండి అత్త, మామ, మరిది వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని తన భర్త ప్రశాంత్,అత్త కళావతి,మామ వెంకటేశ్వర్లు, మరిది ప్రణరులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని స్రవంతి తన తండ్రికి చెప్పుకొని ఏడ్చింది. నెల రోజుల కిందట పంచాయితీ పెట్టగా ప్రవంతి పట్ల కుటుంబీకులు దుర్భాషలాడారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె డ్యూటీకి వెళ్తానని చెప్పి మచ్చాపురం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుమారుడు కుశాల్ గమనించి కేకలు వేయగా పొరుగువారు వచ్చి చూడగా అప్పటికే స్రవంతి మృతిచెం దింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జయపాల్‌రావు తెలిపారు.