Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జట్టు కెప్పెన్ సమ్మయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని గౌరవరం యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి నిర్వహించిన చర్ల, దుమ్ముగూడెం మండలాల స్థాయి సోయం గంగులు మోమోరియల్ క్రికెట్ టోర్నీలలో సెమీ ఫైనల్ నిర్వహించకుండానే నిర్వహకులు క్రీడలు ముగించారని ఆరోపిస్తూ పెద్దనల్లబల్లి క్రికెట్ టీం కెప్టెన్ కణితి సమ్మయ్య సోమవారం ఎస్సై రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. టోర్నీలలో మొత్తం 64 టీములు పాల్గొనగా పెద్దనల్లబల్లి, లింగాపురం, మారేడుబాక, మంగువాయి బాడువ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకోగా మారేడుబాక, మంగువాయిబాడువ జట్లు సెమీ ఫైనల్లో పాల్గొనగా మారేడుబాక జట్టు విన్నర్‌గా నిలిచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పెద్దనల్లబల్లి జట్టు లింగాపురం జట్లను సెమీ ఫైనల్ నిర్వహించకుండానే లింగాపురం జట్టును రన్నర్‌గా నిలిచినట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిర్వహకులు స్పందించి అనుభవం ఉన్న ఎంపైర్లచే మ్యాచ్ నిర్వహించి రన్నర్‌గా నిలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేయాలని కెప్టెన్ సమ్మయ్య నవతెలంగాణకు తెలిపారు. కాగా ఈ విషయమై నవతెలంగాణ నిర్వహకులతో పోన్లో మాట్లాడగా ఇరు జట్లకు చెందిన కెప్టెన్లతో మాట్లాడి సెమీ ఫైనల్ నిర్వహించి గెలుపొందిన జట్టును రన్నర్‌గా ప్రకటించి నగదు పారితోషికం అందజేస్తామని వారు తెలిపారు.