Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోడు భూములకు పట్టాలివ్వాలి
అ బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ నానామాద్రి కృష్ణార్జున్ రావు
నవతెలంగాణ-ఇల్లందు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు పోడుభూములకు పట్టాలు ఇస్తామని నమ్మబలుకుతూ మరోవైపు అమాయక ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారని బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ నానామాద్రి కృష్ణార్జున్ రావు ఆరోపించారు. సోమవారం ఇల్లందు నియోజకవర్గ సమీక్ష సమావేశం మండలంలోని జగదాంబ గుంపు గ్రామంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి ఏడు ఏండ్లు దాటినా నేటికి ఒక ఎకరానికి కూడా పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్ మాటలు నమ్మి తెరాసలో చేరుతున్నామని అధికారపార్టీలో చేరి ఇన్ని నెలలు గడుస్తున్నా కేసీఆర్ను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ఇటీవల ములకలపల్లిలో మహిళలపై ఫారెస్టు అధికారి దాడి చేసిన ఘటనపై విచారణ జరిపించి సంబందిత అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, జిల్లా ఇన్చార్జ్ గంధం మల్లికార్జున రావు, జిల్లా కార్యదర్శులు తచ్చాడి సత్యనారాయణ, కాంతారావు, శివకుమార్, అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.