Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు వెంటనే ఇవ్వాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు డి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కుంటల్ల, బద్దుతండా గ్రామపంచాయతీ సర్పంచులు మోకాళ్ళ రమాదేవి, చిన్నికు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎర్రయ్య, పంచాయతీ కార్మికులు రాజు, ఈశ్వర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుండాల గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టియూ గుండాల ఏరియా కార్యదర్శి గుర్రం పుష్పరాజు, నాయకులు బొర్ర వెంకన్న, గణేష్ అన్నారు. ఈ విషయమై మంగళవారం మండలంలోని కాచనపల్లి, మామకన్ను, గుండాల గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
రాష్ట్రంలో వివిధ శాఖలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్, హెల్త్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌదా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాపోలు కృష్ణ, సంపత్, బిక్షపతి, రాజు, జగన్, సమ్మయ్య, దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.