Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏడీఈ కోటేశ్వరరావు, ఏఈ రవి
నవతెలంగాణ-గుండాల
విద్యుత్ బిల్లులను పెండింగ్ లేకుండా సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ ఏడీఈ కోటేశ్వరరావు, ఏఈ రవి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఇంటింటికి తిరిగి విద్యుత్ బిల్లులు రాబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు బకాయి పడకుండా ఎప్పటికప్పుడు చెల్లించి సంస్థ అభివృద్దికి తోడ్పడాలని విద్యుత్ వినియోగదారులను కోరారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ చీనా, లైన్ ఇన్స్పెక్టర్ మాదార్ సాహెబ్, లైన్ మేన్లు పాల్గొన్నారు.