Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని రామాంజిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద హరిజన దంపతులు ఇరువురూ కరోనా బాధితులై హౌం ఐసోల ేషన్లో ఉన్న నేపథ్యంలో మండల ప్రభుత్వ ఆసుపత్రి ఎఫ్ఎన్ఓ మొహమ్మద్ యాఖుబ్బీ, తునికిబండల పాఠశాల హెచ్ఎం ఇస్లావత్ నరేష్‌లు కొంత ఆర్థిక సహాయం, బియ్యం, గుడ్లు, నిత్యావసర సరుకులు మంగళవారం అందజేశారు. అలాగే మండల కేంద్రములోని కొమ్ముగూడెం కాలనీకి చెందిన నిరుపేద ముస్లిం మహిళ (రెండో సారి కరోనా పాజిటివ్), ఆమె కూతురు ఇరువురు కరోనా బారిన పడటంతో వారికి స్థానిక ప్రజా జ్యోతి విలేకరి మల్లు మధులత, యాఖుబ్బి ఇతోధిక సహాయంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు.