Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ఆదివాసీలపై ఇంకెంతకాలం ఈ రాక్షస పాలన కొనసాగుతుందని ఆదివాసీ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆయన మండలంలోని ఈ బయ్యారం క్రాస్ రోడ్లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ములకలపల్లి మండలంలో సాకీవలస ఆదివాసీ మహిళలపై అత్యాచార దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ఫారెస్ట్ గార్డ్ మహేష్‌పై కేసు నమోదు చేయటమే కాకుండా ఉద్యోగం నుండి డిస్మిస్ చెయ్యాలని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొమరం శ్రీను, కల్తీ సందీప్, కృష్ణమూర్తి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.