Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనజీవన స్రవంతిలో కలిసిన వారికి
అ చక్కటి అవకాశాలు కల్పిస్తాం
అ ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-చర్ల
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన చర్ల ఎల్జిఎస్ దళ సభ్యురాలు వెట్టి జోగి అలియాస్ జ్యోతి(19) తండ్రి అడమయ్య, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. వెట్టి జోగి అలియాస్ జ్యోతి 15 సంవత్సరాల వయస్సులో 2018లో మావోయిస్టు పార్టీలో బలవంతంగా చేర్పించారు. మావోయిస్టు పార్టీ నేతలు ఆదివాసీ పిల్లలను బడికి వెళ్లనివ్వడం లేదు. వారు ఈ ఆదివాసీ మైనర్ బాలికలు మరియు అబ్బాయిలను బెదిరించి, వారిని మావోయిస్టు పార్టీలో చేరెలా చేస్తున్నారు. ఆ విధంగా మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీల హక్కులను ఉల్లంఘిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు మైనర్ వయసు నుండే చెర్ల ఎలీఎస్లో దళ సభ్యురాలుగా ఆమె అన్ని కూలి పనులు, వంట చేయడం, సామాను మోయడం, ఆయుధాలు పట్టుకోవడం, నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం, ఆజాద్, మధు, అరుణ, రజిత ( బడే చొక్కారావు ఏ దామోదర్ భార్య ) వంటి సీనియర్ మావోయిస్టులకు గార్డు డ్యూటీ చేయడం వంటివి చేయాల్సి వచ్చింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నప్పుడు, మావోయిస్టు పార్టీ నాయకులు మైనర్ దళ సభ్యులను పోలీసు కాల్పుల నుండి కవర్గా ఉపయోగించుకుని తప్పించుకుంటున్నారు. జ్యోతిని గత కొంత కాలం గా మావోయిస్టు సీనియర్ నాయకుడు, దళ సభ్యులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తుండడం తో విసుగు చెంది పార్టీ నుండి బయటికి రావాలని నిర్ణయించింది. మెరుగైన జీవితాన్ని గడపడానికి మీ బంధువులు లేదా పోలీసులను సంప్రదించవలసిందిగా మేము ఇతర దళం సభ్యులు మిలీషియా సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. అశోక్, ఎస్సై రాజు వర్మ సిఆర్పిఎఫ్ అధికారి ఉన్నారు.