Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-ఖమ్మం
నగరాభివృద్ధికి రహదారులే ప్రధానమని, ఆ దిశగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందని ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లలో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో సి.సి. రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. రూ.77.70 లక్షలతో నిర్మించిన మూడు వి.డి.ఎఫ్ రోడ్లను మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించారు. 56వ డివిజన్ సహకరనగర్ నందు రూ. 16.40 లక్షలు, 48వ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ నందు రూ.21.50 లక్షలతో రెండు రోడ్లు. 45వ డివిజన్ మామిళ్లగూడెంలో రూ.40.80 లక్షలతో నిర్మించిన రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్ 8వ డివిజన్ నందు నూతనంగా నిర్మించిన పువ్వాడ అజరు నగర్ ఆర్చిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవలే కురిసిన వర్షాల ధాటికి పేదలు నిర్మించుకున్న ఇంటి పై కప్పు విరిగిపోయినందుకు గాను ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలిసి మంత్రి అందజేశారు. 49 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.4.90 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తాతా మధుసూధన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రంజిత్ కుమార్, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పుష్ప, పాల్గొన్నారు.