Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవం
అ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి 11 మందికి చోటు
అ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ముగ్గురు....
అ ఇతరత్ర కమిటీల్లోనూ ఐదుగురికి స్థానం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లోని సున్నం రాజయ్య నగర్లో 22వ తేదీ నుంచి నిర్వహించిన పార్టీ రాష్ట్ర తృతీయ మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ మహాసభల్లో భాగంగా మొత్తం 60 మందితో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10మందికి చోటు దక్కింది. ఇతరత్ర కమిటీల్లోనూ నలుగురికి స్థానం లభించింది. కమిటీలో ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐదుగురు రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు.
- ఖమ్మం జిల్లా నుంచి...
ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి ఎన్నికైన వారిలో కార్యదర్శి తమ్మినేనితో పాటు కార్యదర్శివర్గ సభ్యులుగా పోతినేని సుదర్శన్ సైతం మూడోసారి ఎన్నికయ్యారు. కార్యవర్గంలో నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతికి చోటు లభించింది.
- భద్రాద్రి కొత్తగూడెం నుంచి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా బి.వెంకట్ మరోమారు ఎన్నికయ్యారు. బండారు రవికుమార్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, మచ్చ వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
- కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మిడియం
పార్టీ రాష్ట్ర కమిటీల్లో భాగంగా వివిధ కమిటీలను ఎన్నుకున్నారు. దీనిలో కంట్రోల్ కమిషన్ కమిటీ చైర్మన్గా మాజీ ఎంపీ మిడియం బాబూరావు ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా ఈయనకు స్థానం కల్పించారు. ఈ కమిటీ సభ్యులుగా సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీ ఆహ్వానితులుగా సీనియర్ నాయకులు ఎం.సోమయ్య, బత్తుల హైమావతి, ఆనందాచారిని తీసుకున్నారు.
- తెల్దారుపల్లి నుంచి పార్టీ తెలంగాణ కార్యదర్శి వరకు...
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని వీరభద్రం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం ఇది మూడోసారి. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తమ్మినేని సుబ్బయ్య, కమలమ్మ దంపతులకు జన్మించిన తమ్మినేని 1971లో పార్టీలో చేరారు. నాటి నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. 1991లో ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడారు. 1996లో ఖమ్మం ఎంపీగా , 2004లో ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018, తిరిగి 2022లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తమ్మినేని వీరభద్రానికి ఇరు జిల్లాల పార్టీ కమిటీల తరఫున కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య విప్లవాభినందనలు తెలిపారు.