Authorization
Mon Jan 19, 2015 06:51 pm
28న అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ - వైరాటౌన్
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో జనవరి 28న జరిగే అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత కోరారు. మంగళవారం గుడిమెట్ల రజిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని కోరుతూ హిమాయత్ నగర్లోని ముగ్దంభవనం నందు జనవరి 28వ తేదీ ఉదయం 11:30 గంటలకు అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని అన్నారు. అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లు రవి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏం.కోదండరాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహ, బి.ఎస్.పి కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నాంటారని తెలిపారు. కావున రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కల్లూరు : అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో జనవరి 28న జరిగే అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గోగుల వేంకటేశ్వరరావు కోరారు. మంగళవారం జరిగిన సమావేశంలో గోగుల వేంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, దుర్గ రావు,శంకర్ పాల్గొన్నారు.