Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా ఖ్యాతిని దేశ స్థాయి లో ఇనుమడింప జేసిన ఆర్జేసీ విద్యార్థిని
నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన నున్న మహేశ్వరి
అభినందించిన పలువురు ప్రముఖులు
నవతెలంగాణ-గాంధీచౌక్
విద్యార్థులు ఎన్నుకున్న లక్షానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ నిరుపేద విద్యార్థిని....తండ్రి రైస్ మిల్లులో కూలీ పని చేస్తూ తమని చదివిస్తున్న దానికి సార్థకత చేకూర్చాలనుకుంది...అనుకున్నదే తడవుగా తాను చదివే డిగ్రీ విద్యలో రాణిస్తూనే ఎన్సిసిలో కూడా చేరి ఈ నెల 26న ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే కవాతులో పాల్గొననుంది...వివరాల్లోకి వెళితే....ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్ ప్రాంతంలో గల ఆర్జేసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న నిరుపేద కుటుంబంకు చెందిన సిహెచ్.ఉమామహేశ్వరి ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే కవాతులో జిల్లా నుండి పాల్గొనే ఏకైక విద్యార్థిగా ఘనత సాధించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప జేసీంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ కవాతులో పాల్గొని సర్టిఫికేట్ పొందాలంటే అసాధారణంగా శ్రమించాలి. తన కఠోర శ్రమతో పట్టుదలే ఆయుధంగా ఈ ఘనత సాధించిన సదరు విద్యార్ధిని కళాశాల చైర్మన్ గుండాల( ఆర్జేసీ) కృష్ణతో పాటు ప్రిన్సిపాల్ జాఫర్ ఖాన్, వైస్ ప్రిన్సిపాల్ అలవాల లింగయ్య, పలువురు అధ్యాపకులు, ఆర్జేసీ కళాశాల ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ నిమ్మల సంపత్ యాదవ్, పలువురు ఎన్సిసి అధికారులు, ఆర్మీ అధికారులు, పుర ప్రముఖులు అభినందించారు. కాగా ఆమె సోదరి కూడా ఆర్జేసీ కళాశాలలో ఇంటర్ చదువుతూ రాణించడం విశేషం. అయితే ఈ నిరుపేద కుటుంబంకు చెందిన ఇద్దరు భవిష్యత్లో మరింత రాణించాలని మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.