Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక మనస్తాపానికి గురై ఖమ్మం రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ డిమాండ్ చేశారు. సాగర్‌కు నివాళ్లర్పిస్తూ మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సరితా క్లినిక్ సెంటర్లో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతల రమేష్ మాట్లాడుతూ సాగర్ ఆత్మహత్య ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల హత్యే అన్నారు. గత ఏడున్నర సంవత్సరాల నుండి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య ఉపేందర్ నాయక్, నాయకులు నరేష్, నవీన్, వీరబాబు, వినోద్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.