Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లా వైఎస్సార్ టిపీ నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఉమ్మడి జిల్లా కో- ఆర్డినేటర్‌గా గడిపల్లి కవిత నియామకం పట్ల ఆ పార్టీ నేతలు మంగళవారం ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో లక్కినేని సుధీర్ బాబు అధ్యక్షతన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు టీ కే కృష్ణ మోహన్, ఇస్లావత్ రాంబాబు నాయక్, ఆలస్యం రవి, రాఘవ, రాము నాయక్, ఆడప నవీన్, ఖలీల్ భాషా, తేజ్, మీడియా కోఆర్డినేటర్ నామా వినోద్, గోరంట్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు .