Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
నిరుద్యోగి సాగర్ మృతికి సీఎం కేసీఆర్ కారణమని ఖమ్మం అసెంబ్లీ యువజనకాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోతు కోటేష్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని బద్య తండా గ్రామంలో గురువారం సాయంత్రం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని గాలికి వదిలేశారని ఆయన గుర్తు చేశారు. ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణాలకు బలి అవుతున్నారని, అయినా కూడా కేసీఆర్ కి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శిం చారు. సాగర్ కుటుంబానికి 40 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తేజావత్ లక్మానాయక్, మరియు బానోతుకుమార్, వార్డ్ మెంబర్ తేజావతు శరత్ కుమార్,దేవి లాల్, దశరథ్, నరేందర్ పాల్గొన్నారు.