Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
కష్టజీవుల సమస్యల పరిష్కారంలో హెచ్చు కోటయ్య ఎంతో కృషి చేశాడని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోనే గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన ఎచ్చు కోటయ్య సంతాప సభ గురువారం సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ సిపిఎంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, గ్రామంలో వ్యవసాయ కూలీల సమస్యలపై కూలి పోరాటాలు నిర్వహించడంలో క్రియాశీలకంగా పని చేయడంలో మంచి గుర్తింపు కలిగిన కార్యకర్తగా పని చేసాడని కొనియాడారు. 1996 నుంచి నాయకత్వ స్థానంలో ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా దానిని తప్పకుండా నెరవేర్చే వాడని కొనియాడారు. దళితుల ఇళ్ల ఫ్లాట్ల కోసం సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి ఉమ్మనేని లక్ష్మీనారాయణ స్థలాన్ని పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మాట్లాడి ఎచ్చు కోటయ్య ఆధ్వర్యంలో దళితులకు ఇళ్ల ఫ్లాట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలలో కోటయ్య కీలకపాత్ర నిర్వహించాడు అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, నాయకులు మాదనేని నారాయణ, సిపిఎం గ్రామ కమిటీ కన్వీనర్ ఉమ్మనేని రవి, శాఖా కార్యదర్శులు ఏడునూతల లక్ష్మణరావు, కోటా కాటయ్య, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, సిపిఎం నాయకులు, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, మాజీ ఎంపీపీ కొమ్ము శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ కళ్యాణపు శ్రీనివాసరావు, కళ్యాణపు బుచ్చయ్య, నల్లమోతు నాగేశ్వరరావు, ఏసు పోగు బాబు, ఎస్సీ కాలనీ సంఘ అధ్యక్షలు మంద మదార్ కార్యదర్శి రమేష్, కోటయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.