Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలేకరుల సమావేశంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి శివకుమార్
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్ నుండి 200 సభ్యత్వ నమోదు చేయాలని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి డాక్టర్ శివకుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందించిన ఫలాలను గురించి వివరంగా పూర్తిస్థాయిలో వివరిస్తూ ప్రతి బూతు నుండి రెండు వందల సభ్యత్వ తక్కువ కాకుండా నమోదు చేయాలని, అదేవిధంగా సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యునికి రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని దీన్ని వినియోగించుకోవాలని కోరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావీద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త నుండి నాయకుల ద్వారా సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం లో 6 వేలు సభ్యత్వాలు నమోదయ్యాయని. ఇంకా సుమారు 50 వేలు సభ్యత్వ నమోదు చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ వైస్ మార్కెట్ చైర్మన్ భాస్కర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, ఉపేందర్, రమేష్ ,ఏలూరు రవి, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.