Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసుపత్రి శంకుస్థాపన పనుల పరిశీలన
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆసుపత్రి కల అతి త్వరలో నెరవేరనుందని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రూ. 34 కోట్లతో నిర్మాణం జరుగనున్న 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ఉదయం 9 గంటలకు సత్తుపల్లి రానున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే సండ్ర ఆయా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన సత్తుపల్లి, మధిర ఆసుపత్రులను 100 పడకలకు రూ. 34 కోట్లతో అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడం జరిగిందన్నారు. సత్తుపల్లికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడంపై ఎమ్మెల్యే సండ్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. వసతుల కల్పనతో పాటు డాక్టర్లను నియమిస్తూ కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించనుందన్నారు. మండలంలోని నారాయణపురం గ్రామంలో షిరిడీ సాయి జనమంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. పెనుబల్లి, కల్లూరు ప్రభుత్వాసుపత్రులకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలని, సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి అదనంగా మరో డయాలసిస్ కేంద్రంతో పాటు ఆర్థోపెడిక్ కేంద్రం, తల్లాడ, వేంసూరుకు పీహెచ్‌సీలు మంజూరు చేసేలా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు విన్నవించనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. రవాణామంత్రి పువ్వాడ అజరుకుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, వైద్య, ఆరోగ్యశాఖ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్ 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొతూఉ ఉమామహేశ్వరరావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, మల్లూరు అంకమరాజు, గండ్ర రాఘవేంద్ర, మారుతి సూరిబాబు పాల్గొన్నారు.