Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కెసిఆర్ నియమించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాదులోని మంత్రి అధికారిక నివాసంలో గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ను మంత్రి సన్మానించారు. ఆ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కూడా ఉన్నారు. నూతనంగా నియమితులైన పార్టీ జిల్లాల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, సీఎం కెసిఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సూచించారు. పార్టీకి, పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా జిల్లాల పార్టీ అధ్యక్షులు పని చేయాలని ఆకాంక్షించారు. పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, దేశంలోనే ఇంతగా కార్యకర్తల బలమున్న పార్టీ లేదన్నారు టిఆర్ఎస్ లో ఉండటం ఒక గౌరవం, ఒక బలం, బలగం అని మంత్రి అన్నారు. పార్టీ గౌరవాన్ని, సీఎం కెసిఆర్ నమ్మకాన్ని మరింత పెంచే విధంగా పని చేయాలని మంత్రి పువ్వాడ పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులకు సూచించారు.