Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల కేంద్రానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు యాకుబ్ మియా ఆనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల క్రిష్ణయ్య పార్టీ జెండా కప్పి నివాళుర్పించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం మధిర మండలంలో జరిగిన ద్విచక్ర వాహన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం అయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఖమ్మం, హైదరాబాద్లో మెరుగైన వైద్యం అందించారు. అనంతరం వైద్యులు తలకు శస్త్రచికిత్సలు చేసారు. అప్పటినుంచి మంచంపైన ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సూమారు నాలుగు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైయ్యాడు. కూతుర్లు, అల్లుళ్లు, భార్య లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయిందని రోదిస్తున్నారు. తల్లాడ మండలం గోపాల్ పేటకు చెందిన యాకుబ్ మియా గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వృత్తిరిత్యా వండ్రంగి పనిచేసేందుకు భార్య, నలుగురు ఆడపిల్లలతో కొణిజర్ల వచ్చాడు. స్వతహాగా తన సొంత గ్రామం గోపాల్ పేటలో సీపీఎం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అదే స్పూర్తితో మండల కేంద్రంలో వండ్రంగి పనిచేస్తూ సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేసారు. అ తర్వాత సీఐటీయూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కుకున్నాడు. నలుగురు ఆడపిల్లలు అయినప్పటికీ వాళ్ళను కష్టపడి ఉన్నత చదువులు చదివించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. నలుగురు ఆడపిల్లలు చదువులో ముందుంజలో ఉండేవారు.అదేవిధంగా పెద్ద కూమార్తె ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహించేవాడు యాకుబ్ మియా. తండ్రి స్పూర్తితో పెద్ద కూమార్తె ఎస్ఎప్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడింది. యాకుబ్ మియా మృతదేహాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు తాత భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ, మెరుగు సత్యనారాయణ, సీఐటీయూ మండల కన్వీనర్ మోత్కూరి వెంకటేశ్వరరావు, అనుమోలు రామారావు, తల్లాడ మండల కార్యదర్శి అయినాల రామలింగశ్వరేరరావు, రైతుసంఘం జిల్లా నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, గోపాల్ పేట సర్పంచ్ నల్లమోతు మోహన్రావు, రోషన్ తాళ్లపల్లి విజయ, వైరా ఐద్వా టౌన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత మోహన్ రావు, ఎన్డీ వైరా కల్లూరు డివిజన్ నాయకులు షేక్ ఖాసీం, డివైఎప్ఐ జిల్లా నాయకులు షేక్ అఫ్జల్, నాగుల్ మీరా తదితరులు సందర్శించి నివాల్లర్పించారు.
గుడ్ల సత్యంకు నివాళి
ఏన్కూరు మండల పరిధిలోని అరికాయలపాడు గ్రామ సిపిఎం సీనియర్ నాయకులు గుడ్ల సత్యం చిత్రపటానికి గురువారం సిపిఎం రాష్ట్ర నాయకులు మందడపు సాయిబాబు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ ఎదుగుదలకు సత్యం కృషి చేశారన్నారు. సత్యం కుమారుడు గుడ్ల వెంకటేశ్వరరావు గ్రామ ఉపసర్పంచ్ పార్టీ నాయకుడిగా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మండల కార్యదర్శి దొంతెబోయిన నాగేశ్వరరావు, బానోతు బాలాజీ, ఏర్పుల రాములు, గార్లఒడ్డు సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమలరావు, మండల కో ఆప్షన్ సభ్యులు నవాబ్ బేగ్, గద్దల గూడెం గ్రామ సర్పంచ్ పుల్లూరు వెంకటేశ్వర్లు, భూలక్ష్మీ, గంజి నాగేశ్వరరావు, ఉదారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.