Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ పంచాయతీ తీర్మానం చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ తొండల గోపవరం సర్పంచ్, కార్యదర్శిలకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తొండలగోపవరం గ్రామపంచాయతీ తొర్లపాడు రెవిన్యూ 104, 105 సర్వే నెంబర్స్‌లో శివారు గ్రామం సాయిపురం సమీపంలో ఇథనల్ పరిశ్రమ హిందూస్తాన్ పెట్రోలియం అనుబంధ సంస్ధ ఏర్పాటుకు వ్యతిరేకంగా ా పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు పంపించాలని కోరుతూ సర్పంచ్ పింగళి శిరీష, కార్యదర్శి కిరణ్‌లకు సంతకలతో కూడిన వినతిపత్రం అందించమన్నారు. ప్రజల అభిప్రాయం గౌరవించి ప్రభుత్వాలు పున సమీక్షించుకొని కంపెనీ ఏర్పాటు నిలుపుదల చేయాలని, లేనిపక్షంలో ముంపు గ్రామాలన్నీ ఐక్యం చేసి పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు తమ్మ వెంకటరెడ్డి, శిరం వెంకటేశ్వర్లు, మచ్చ గోపి, చిప్పగిరి ప్రసాద్, పింగళ రామిరెడ్డి, నల్లమల్ల కోటేశ్వరరావు, వాసిరెడ్డి సత్యం, మాధవరావు, భూతుకురి సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, విప్పల సీతారెడ్డి, సూర్యప్రకాష్, పింగళి కృష్ణారెడ్డి, మధుసుధన్, వీరారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.