Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుల వాహనాలను తీసుకెళ్లిన బ్యాంకు అధికారులు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
జేఎల్టీ రుణాలు చెల్లించలేదని డీసీసీబీ అధికారులు మండల పరిధిలోని ముత్తగూడెం ఎస్సీ కాలనీలో రైతులపై గురువారం దౌర్జన్యాలకు దిగారు. రుణాలు చెల్లించకపోతే ఇళ్లలోని సామగ్రిని ఎత్తుకెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. కొంతమంది బైక్లను అధికారులు తీసుకెళ్లారు. తాము చెల్లించాల్సిన రూ.10వేలు, రూ.20వేల కోసం తమపై దౌర్జన్యాలకు దిగడమేంటని రైతులు ప్రశ్నించారు. కొంత మంది రుణాలు చెల్లించారు. మరి కొంత మంది తమకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హేయమైన చర్య
కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక, పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులో ఉంటే బ్యాంకు అధికారులు బకాయిలు చెల్లించలేదని వస్తువులు తీసుకెళ్లడం హేయమైన చర్య అని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి తోట పెద్ద వెంకట రెడ్డి అన్నారు. బ్యాంకు అధికారులు గడువు పెంచకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.