Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.1.20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ
అ ఐటీసీ (పియస్ పిడీ) యూనిట్ హెడ్ సిద్ధార్ధ మహంతి
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐటీసీ పియస్పీడీ పనిచేస్తుందని, ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయడమే ఐటీసీ ప్రధాన ధ్యేయమని ఐటీసీ (పియస్పీడీ) యూనిట్ హెడ్ సిద్ధార్ధ మహంతి అన్నారు. గురువారం ఐటీసీ సీఎస్ఆర్ నిధులు రూ.1.20కోట్లతో మండల పరిధిలోని కోయగూడెం, మోతేపట్టీనగర్ గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణానికి ఆయన ఐటీసీ పీఎస్పీడీ (హెచిహెడ్) శ్యామ్ కిరణ్ కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతేపట్టీనగర్, కోయగూడెం పంచాయతీ ల్లో రూ.1.20కోట్లు కేటాయించి డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. ఈ పనులకు మార్చి 30 నాటికి పూర్తిచేసి ప్రజలకు వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే ఐటీసీ పీఎస్పీడీ ద్వారా సీఎస్ఆర్ నిధులను కేటాయించి పరిసర ప్రాంతాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, బూర్గంపాడు ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఆయా పంచాయతీల సర్పంచ్ లు తుపాకుల రామలక్ష్మి, పోతునూరి సూరమ్మ, కొర్సా లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టీఎన్టీయూసీ అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్, శ్రామికశక్తి అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ పాల్గొన్నారు.