Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ములకలపల్లి : మండల పరిధిలోని సాకివాగు ఘటనలో గిరిజన మహిళలపై దాడులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేష్ కు స్థానచలనం జరిగింది. అడవికి కట్టెల కోసం వెళ్లిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన ఘటన దుమారం లేపడంతో విచారణ నిర్వహించిన అధికారులు ఎట్టకేలకు మహేష్ ను ములకలపల్లి నుంచి పాల్వంచ డివిజన్ కార్యాలయానికి బదిలీ చేశారు . ఈ మేరకు గురువారం అటవీశాఖ రేంజర్ రవికిరణ్ తెలియజేశారు.