Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అభినందించిన మున్సిపల్ చైర్మన్,
సాహితి కళాశాల డైరెక్టర్లు
నవతెలంగాణ-ఇల్లందు
విద్యా రంగంలో సంచలన విజయా లకు మారుపేరుగా నిలుస్తున్న సాహితీ జూనియర్ కళాశాల మరో ప్రభంజనాన్ని సృష్టించింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పునః మూల్యాంకన ఫలితాలలో స్టేట్ రాంక్ దక్కించుకుంది. ఎంపీసీ విభాగంలో ఒంగూరి అక్షయ 470/467 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ విద్యారంగంలో ఎవరూ సాధించని మార్కులతో విజయఢంకా మోగించింది. ఇంతటి ఘన విజయం సాధించిన వంగూరి అక్షయంను గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్లు ఎంసి నాగిరెడ్డి, డాక్టర్.కెఎస్.విసుధాకర్, మాదినేని శ్రీనివాస్, సాహితి కళాశాల ప్రిన్సిపాల్ గుజ్జర్లపూరి రాంబాబు తదితరులు మిఠాయిలు తినిపించి అభినందించారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కళాశాలకు తల్లిదండ్రులకు ఇంతటి ఘన కీర్తిని తీసుకురావడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవెనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శిని విద్యాసంస్థల డైరెక్టర్లు యాదగిరి రాంబాబు, అర్వపల్లి రాధా కృష్ణ, విశ్వశాంతి పాఠశాల డైరెక్టర్ తుమ్మలపల్లి ప్రసాద్,అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.