Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సంతోష్ కుమార్
పినపాక : ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు స్వీకరించేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గొడిశాల రామనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు బోడ రమేష్, గీదా సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.