Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎల్పీవో హరిప్రసాద్
నవతెలంగాణ-ములకలపల్లి
పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఎల్పీవో హరిప్రసాద్ హెచ్చరించారు. ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం తదితర గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించి పారిశుధ్య పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహించవద్దని, ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి వీధిలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, దోమలు వ్యాప్తిచెందకుండా దోమలమందుతో పాటు బ్లీచింగ్ చెల్లించాలని సూచించారు . అదేవిధంగా నర్సరీల్లో మొక్కలను మంచిగా పెంచాలని, మొక్కలను సంరక్షించే విషయంలో వనసంరక్షులు బాధ్యతతో వ్యవహరించాలని, మొక్కల సంరక్షణను పర్యవేక్షించాలని ఎంపీవో లక్ష్మయ్యకు సూచించారు. అనంతరం డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉపసర్పంచ్ శెనగపాటి అంజి, పంచాయతీల కార్యదర్శులు ఉన్నారు.