Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు సర్వీస్ పొడిగింపు 60 నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం మార్చి 2021 నుండి అమలు చేస్తున్నదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పేర్కొన్నారు. ఇది అమలు చేసే దానిలో కార్మికులకు 60 సంవత్సరాల సర్వీసులో ఏవైతే ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలన్నీ 61 సంవత్సరానికి కూడా వర్తింపజేస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. దానికనుగుణంగా కార్మికులతో పాటు జూలై నుంచి కార్మికులు కూడా సర్వీసు కంటిన్యూ చేస్తూ వారి జీవితాలలో సీఎంపిఎఫ్ కార్మికుల జీతాల నుండి రికవరీ చేస్తూ వస్తున్నది కానీ, దానిని అమలు చేయటానికి సీఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డు వారు అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. దీనివల్ల కార్మికులకు సీఎంపిఎఫ్ ప్రయోజనము అమలు చేయటంలో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. సీఎం పిఎఫ్ చట్టంలో ఎక్కడా 60 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ తక్కువగాని పొందుపరచ కుండా కార్మికుడు రిటైర్డ్ వరకు ఆ ప్రయోజనం చేకూర్చే విధంగా చట్టంలో పొందుపరిచారు. దీనిపై మంద నరసింహారావు తీవ్రంగా ఖండిస్తూ ఇది కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగేదిగా ఉందని సీఎం పిఎఫ్ చట్టంలో ఎక్కడా లేని నిబంధనను సీఎం పిఎఫ్ అధికారులు దీనిని తోసిపుచ్చడం సరైనది కాదన్నారు. దీని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తగిన చొరవ తీసుకుని కార్మికులకు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రయోజనం చేకూరే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 28 ఆర్ఎల్ సి వద్ద సింగరేణి యాజమాన్యం, యూనియన్ ప్రతినిధులతో జరిగే చర్చల సందర్భంగా 61 సంవత్సరాల పెంపుదలపై స్టాండింగ్ ఆర్డర్ లో మార్పులు కోరుతూ సమావేశం ఏర్పాటు చేసిన దానిలో సిఐటియు ఈ విషయంపై ప్రస్తావించి కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా ఒత్తిడి తేనున్నట్లు మందా నర్సింహారావు స్పష్టం చేశారు.